మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం చందారం గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు ఆర్థిక సాయం అందించారు భాజపా కౌన్సిలర్.
అనాథలైన పిల్లలకు భాజపా కౌన్సిలర్ ఆర్థిక సాయం - చందారం గ్రామం తాజా వార్తలు
పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు. వారి బాధను చూడలేక భాజపా కౌన్సిలర్ ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు. 11వేల రూపాయలను పిల్లలకు అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు.
అక్కాచెల్లెలు అనిత, మాధవిల తండ్రి సుధాకర్ ఆరేళ్ల క్రితం అంతుచిక్కని వ్యాధితో చనిపోయాడు. నెల రోజుల క్రితం తల్లి కూడా చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
వీరికి నస్పూర్ భాజపా 21 వార్డు కౌన్సిలర్ బేర సత్యనారాయణ 11వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ భాజపా 18వార్డు కౌన్సిలర్ కోడూరి లహరి- విజయ్ పాల్గొన్నారు. ఆడపిల్లలకు పెద్ద దిక్కు అయిన తల్లిదండ్రులను కోల్పోవడంతో తన మనసు చలించి సాయం అందించానని భాజపా కౌన్సిలర్ బెర సత్యనారాయణ తెలిపాడు.