తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పుట్టినరోజును బెల్లంపల్లిలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో 500 మలబారు మొక్కలను నాటారు. నాటిన ప్రతీ మొక్కను సంరక్షిస్తామని ప్రిన్సిపల్ సైదులు, విద్యార్థులు తెలిపారు. కేటిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మొక్కలతో పాటు పాఠశాలకు క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు.
500 మొక్కలు నాటి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు - trs
బెల్లంపల్లిలో కేటీఆర్ జన్మదినాన్ని కాస్త విభిన్నంగా జరిపారు. 500 మొక్కలు నాటి వేడుకలు నిర్వహించారు.
మొక్కలు నాటుతున్న నాయకులు