కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో ముందు వివిధ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. దీంతో 140 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రైతులకు మద్దతుగా వ్యాపార సముదాయాలు, హోటల్స్ ఉదయం నుంచే మూసివేశారు.
మంచిర్యాల జిల్లాలో కొనసాగుతోన్న బంద్ - మంచిర్యాల జిల్లా లేటెస్ట్ వార్తలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారత్ బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్ డిపో ముందు వివిధ పార్టీ నాయకుల ధర్నాతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.
మంచిర్యాల జిల్లాలో కొనసాగుతోన్న బంద్
బస్సులు బయటకు రాకపోవడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించి పోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ చట్టాలతో అన్నదాతలకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్, తెరాస నాయకులు అన్నారు. ఆ చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:తెరాస ప్రభుత్వానికి రైతులే మొదటి ప్రాధాన్యం: కేటీఆర్