మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. నిన్న రోగికి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ తీశారు. దాదాపుగా కరోనా అనే అనుమానంతో బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఇక్కడికి రాగానే ఆక్సిజన్ స్థాయి పడిపోవడం వల్ల చనిపోయాడు. అయితే కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూడటానికి సైతం రాకపోవడం మానవత్వానికి మచ్చగా నిలిచింది. ఈ ఘటనతో జిల్లాలో కరోనా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.
కరోనాతో వ్యక్తి మృతి... కడచూపుకైనా రాని కుటుంబసభ్యులు - మంచిర్యాల జిల్లాలో కరోనాతో వ్యక్తి మృతి
కరోనా అయినవాళ్లనూ.. దూరం చేసింది. ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందితే.. కుటుంబసభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లడానకిి సైతం రాలేదు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
an old man died with corona in manchiryala district
నిన్న రాత్రి 8.30 గంటలకు బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో మృతి చెందిన తర్వాత అతని కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడానికి వైద్య సిబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా కుటుంబ సభ్యులు రాలేదు.
కరోనాతో మృతి చెందిన రోగిని ఎక్కడ ఖననం చేయాలోనని వైద్యశాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
Last Updated : Jul 27, 2020, 4:35 PM IST