మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మయూరి ఎకో పార్క్ ఆడిటోరియంలో బాలల హక్కులు.. పరిరక్షణ.. అమలుపరుస్తున్న విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి, ఎస్పీ రెమారాజేశ్వరి పాల్గొన్నారు. బాలలకు ఉన్న ప్రాథమిక హక్కులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని.. బాలల హక్కుల చట్టాలు పరిరక్షణకు అనేక రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రేమావతి వివరించారు. బాలల హక్కులను పరిరక్షించాల్సిన అవసరం అందరిపైనా ఉందని పేర్కొన్నారు.
'బాలలకు ఉన్న ప్రాథమిక హక్కులపై అవగాహన కల్పించాలి'
బాలల హక్కులను కాపాడుకునే బాధ్యత సమాజంలోని ప్రతి పౌరుడిపైన ఉందని మహబూబ్‌నగర్ జిల్లా న్యాయమూర్తి ప్రేమావతి అన్నారు. బాలబాలికలు సమాజంలోకి అడుగు పెట్టగానే పలు సౌకర్యాలు కల్పించాలని నిర్దేశిస్తూ అనేక చట్టాలు ఉన్నాయని.. వాటిని అమలు పరచడంలో అన్ని విభాగాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని జడ్జి పేర్కొన్నారు.
'బాలలకు ఉన్న ప్రాథమిక హక్కులపై అవగాహన కల్పించాలి'
జిల్లాలోని వివిధ విభాగాల సమన్వయంతో బాల్య వివాహాలు, బాల కార్మికులు, అనాథ పిల్లల సంరక్షణ వంటివి చక్కగా నిర్వహించామని పేర్కొన్నారు. ఈ తరహా కార్యక్రమాలు నిరంతర చర్యగా కొనసాగాలని ఎస్పీ పేర్కొన్నారు. ఇటీవల కాలంలో బాలికలపై జరుగుతున్న దాడులను నివారించేందుకు పోక్సో చట్టాన్ని రూపొందించి అమలు చేస్తున్నా.. కొన్ని సందర్భాలలో పోలీస్ శాఖ బాధితులకు పూర్తి సహకారం అందించలేక పోతుందని తెలిపారు.