మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో గత రెండు వారాలుగా నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు రాస్తారోకోలు నిర్వహించారు. జాతీయ రహదారిపై రోడ్డు విస్తరణ పనుల్లో పైపులైన్లు పగిలి నీటిసరఫరా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం వహిస్తున్నారని మహిళలు వాపోయారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న పురపాలక కమిషనర్ సునీత అక్కడికి చేరుకొని మహిళలకు వివరణ ఇచ్చారు. జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల వల్ల నీటి సరఫరా ఆగిపోయిందని.. ఇందులో తమ శాఖ నిర్లక్ష్యం లేదని వివరించారు. పగిలిపోయిన పైపులకు మరమ్మత్తులు నిర్వహించి తమ సమస్యను తీర్చాలని మహిళలు కోరారు.
నీటి కోసం జడ్చర్ల మహిళల రాస్తారోకో - జడ్చర్ల
రెండు వారాలుగా నీటి సరఫరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో మహిళలు రాస్తారోకో నిర్వహించారు.
మహిళల రాస్తారోకో