మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరవేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ బూత్పూర్ జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానానికి తెరాస అభ్యర్థి స్వర్ణ సుధాకర్ చేత నామినేషన్ దాఖలు చేయించారు. తెలంగాణ ప్రగతి, భావితరాల భవిష్యత్ కోసం తెరాసకు ఓటు వేయాలని మంత్రి కోరారు. కేసీఆర్, కేటీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పాలమూరు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేస్తానని స్వర్ణ సుధాకర్ తెలిపారు. నామినేషన్ కార్యక్రమంలో తెరాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్, స్థానిక శానస సభ్యుడు ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్‌పై గులాబీ జెండాఎగరేస్తాం - స్థానిక సంస్థల ఎన్నికలు
మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్‌పై గులాబీ జెండాఎగరేస్తాం
బూత్పూర్ జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానానికి కాంగ్రెస్ తరఫున సరిత, భాజపా నుంచి మేషన నామపత్రాలు సమర్పించారు.
ఇవీ చూడండి: 'మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం'