ఆ డబ్బాలు అద్భుతం చేశాయి...! - TOILETS
శౌచాలయాలు లేక విద్యార్థులు పడుతున్న అవస్థలు ఓ ఉపాధ్యాయుని చిన్ని ఆలోచనతో తీరిపోయాయి. స్వచ్ఛ భారత్- స్వచ్ఛ విద్యాలయాల పథకంలో అవార్డు తెచ్చిపెట్టింది. పరిశుభ్రతలో మిగిలిన పాఠశాలలకు ఆదర్శంగా నిలిచింది కిష్టాపూర్ ప్రాథమిక పాఠశాల.
ఒక్క ఆలోచన... స్వచ్ఛత వైపు..!
చిన్నారులకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించిన కుండీల్లో కులాయిలను ఏర్పాటు చేసి పిల్లలకు శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల సహాకారంతో చేపట్టిన స్వచ్ఛ భారత్- స్వచ్ఛ విద్యాలయం కార్యక్రమంలో జిల్లా స్థాయి అవార్డు పొందారు. తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసిన శౌచాలయాలు చిన్నారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయని ఉపాధ్యాయులు అంటున్నారు.
ఒక సృజనాత్మకమైన ఆలోచన వీరిని స్వచ్ఛ భారత్- స్వచ్ఛ విద్యాలయాల వైపు నడిపించింది. జిల్లాలోని ప్రతి పాఠశాలలో ఇదేవిధంగా మార్చాలని పాలనాధికారి రోనాల్డ్‌రాస్ ఆదేశించేంతగా.. పేరు తెచ్చిపెట్టింది.