Tummilla Lift Irrigation Project in Gadwal :జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో.. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంపై ఆధారపడి సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయి. అక్కడ సాధారణంగా వర్షాధార పంటలే సాగుచేస్తారు. మూడేళ్లుగా ఈ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టు రైతులకు వానాకాలంలో సాగునీరందగా ఈసారి వస్తాయని ఆశించి పెద్దఎత్తున పంటలు(Paddy Crops) వేశారు. కానీ వర్షాభావ పరిస్థితులు, ప్రస్తుతం తుంగభద్రలో నీరులేకపోవడంతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి సాగునీరు అందిచంలేని దుస్థితి. నీళ్లు లేక, వానలూ రాక వేసిన పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
No Water in Thummilla Lift Irrigation Project : వానాకాలం ప్రారంభంలో వానల్లేక రెండు, మూడుసార్లు పత్తి విత్తాల్సి వచ్చింది. జులైలో కురిసిన వానలు పంటకు ఊరటనిచ్చినా మొక్క ఎదుగుదల లేకుండాపోయింది. ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షాభావ పరిస్థితితో పత్తి ఎర్రబారిపోతోంది. ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం లేక ఇప్పటికే చాలా మంది రైతులు పత్తి పంటను పెరికి వేసి.. ముందస్తు యాసంగికి సిద్ధమవుతున్నారు. మొక్కజొన్న, కంది రైతుల పరిస్థితి దాదాపుగా అలాగే ఉంది. కంది మొక్కలు పసుపురంగులోకి మారిపూతరావట్లేదు. మొక్కజొన్నలో మొక్క ఎదుగుదల లేక కంకి నాణ్యంగా రావట్లేదు. మిరప రైతు పరిస్థితీ దారుణంగా తయారైంది. కనీసం పెట్టుబడి దక్కే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
ఈ వానాకాలం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి నీటివిడుదల మూన్నాళ్ల ముచ్చటగా మారింది. కేవలం 5 రోజులే నీటిని విడుదల చేసి నదిలో నీటిలభ్యత లేక.. ఆ తర్వాత ఆపేశారు. 21 డిస్టిబ్యూటరీ నుంచి 28వ డిస్టిబ్యూటరీ వరకు కొద్దిమేర నీటితడులు అందాయి. 29వ డిస్టిబ్యూటరీ నుంచి.. దిగువకు నీరందలేదు. జూరాల లింక్ కెనాల్ కింద ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. మిగిలిన ఆయకట్టు ప్రస్తుతం ఎండిపోయే పరిస్థితి ఉంది. నీరులేక దాదాపు పంటపై రైతులు ఆశలు వదులుకునే దుస్థితి నెలకొంది.
Cotton Farmers Problems Telangana 2023 : ప్రతికూల వాతావరణం.. పత్తి రైతులకు శాపం