జడ్చర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తెరాస - తెరాస గెలుపు
జడ్చర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తెరాస
12:15 May 03
జడ్చర్లలో కారుకే పట్టం
జడ్చర్ల మున్సిపాలిటీని తెరాస కైవసం చేసుకుంది. బల్దియా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ప్రజలు తేల్చేశారు. తెరాస పార్టీకే పట్టం కట్టారు. మొత్తం 27 వార్డుల్లో ఇప్పటివరకు 19 వార్డుల్లో లెక్కింపు పూర్తైంది. ఫలితాలు వెలువడిన 19 వార్డుల్లో 16 చోట్ల తెరాస జెండా ఎగురవేసింది.
కొవిడ్ మార్గదర్శకాలతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి:ఓరుగల్లులో 16 డివిజన్లలో తెరాస విజయం
Last Updated : May 3, 2021, 1:15 PM IST