తెలంగాణ

telangana

ETV Bharat / state

గుండు తీర్పు ఇచ్చిన  పెద్దల అరెస్టు - గుండు తీర్పు ఇచ్చిన  పెద్దల అరెస్టు

మహబూబ్​నగర్​ జిల్లా ముచ్చింతల గ్రామంలో గేదెను అపహరించి విక్రయించారని ఇద్దరు యువకులకు గుండు గీయించిన గ్రామ పెద్దల్లో  9 మందిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

గుండు తీర్పు ఇచ్చిన  పెద్దల అరెస్టు

By

Published : May 18, 2019, 5:40 PM IST

గుండు తీర్పు ఇచ్చిన పెద్దల అరెస్టు

మహబూబ్​నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ముచ్చింతల గ్రామంలో గేదెలు విక్రయించారనే నేరారోపణ చేసి పంచాయతీ పెద్దల సమక్షంలో ఇద్దరు యువకులకు గుండు గీయించారు. ఈ సంఘటనలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. పంచాయతీ తీర్పు చెప్పిన మాజీ సర్పంచ్ హర్షవర్ధన్ రెడ్డి, జానకిరాములు , వెంకటేశ్వర్ రెడ్డి, విష్ణువర్ధన్​రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి , భాస్కర్ రెడ్డి, వెంకట్ రెడ్డితోపాటు గుండు గీసిన నాయిబ్రాహ్మణుడు బాలకృష్ణను కోర్టులో హాజరుపర్చారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details