విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాతో దాదాపు గంట సేపు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
జడ్చర్లలో విద్యార్థుల ఆందోళన
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల ఆందోళన