మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని నెల్లికొండి గ్రామంలో సంక్రాంతిని పురస్కరించుకొని పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఏర్పాటు చేసిన ధ్యాన మహోత్సవాలలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ధ్యాన ప్రచారకులు పత్రీజీ శిష్యులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఘనంగా ధ్యాన మహోత్సవాలు
మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో ధ్యాన ప్రచారకులు పత్రీజీ శిష్యులు ఏర్పాటు చేసిన ధ్యాన మహోత్సవాలకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ధ్యాన నాధ సంగీతంతో కాసేపు ధ్యానం చేశారు.
ఘనంగా ధ్యాన మహోత్సవాలు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనశాలను ఎమ్మెల్యే సందర్శించారు. ధ్యాన పుస్తకాలను సేకరించారు. ధ్యాన నాధ సంగీతంతో కాసేపు ధ్యానం చేశారు.
ఇదీ చదవండి:సంస్కృతి సంతకం... సంక్రాంతి!