మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం శాగాపూర్ సమీపంలోని ఊర చెరువు 20 ఏళ్ల తర్వాత అలుగు పారుతోంది. వరద నీటి ఉద్ధృతితో 44వ జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టు దెబ్బతిన్నది. కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి కుంగిపోవడం వల్ల గ్రామస్థులు అప్రమత్తమై.. ఆ దారిలో వచ్చే వాహనాలను నిలిపివేశారు.
భారీ వర్షం.. 20 ఏళ్ల తర్వాత అలుగు పారుతున్న ఊరచెరువు - roads damaged in mahabubnagar district
మహబూబ్నగర్లో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండిపోయాయి. అడ్డాకుల మండలం శాగాపూర్ సమీపంలోని ఊర చెరువు 20 ఏళ్ల తర్వాత అలుగు పారుతోంది.
మహబూబ్నగర్ జిల్లాలో భారీ వర్షం
అనంతరం పోలీసులకు, ఎల్అండ్టీ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. వాహనాల రాకపోకలను హైదరాబాద్-బెంగళూరు రహదారి వైపు మళ్లించారు. దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు.