తెలంగాణ

telangana

ETV Bharat / state

'సామాజిక మాధ్యమాల్లో బ్యాలెట్'​ పై ఫిర్యాదు - mahaboobnagar

రెండో విడత పరిషత్​ ఎన్నికల సందర్భంగా మహబూబ్​నగర్​ జిల్లాలో ఓటేసిన బ్యాలెట్​ పత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఘటనపై అధికారులు దృష్టిసారించారు. బ్యాలెట్​ క్రమసంఖ్య ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

'సామాజిక మాధ్యమాల్లో బ్యాలెట్'​ పై ఫిర్యాదు

By

Published : May 12, 2019, 4:31 PM IST

'సామాజిక మాధ్యమాల్లో బ్యాలెట్'​ పై ఫిర్యాదు
మహబూబ్​నగర్​ జిల్లా రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓటేసిన బ్యాలెట్​ పత్రాలను ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఈ ఘటనపై దృష్టిసారించిన అధికారులు క్రమ సంఖ్య ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించారు. దేవరకద్ర మండలం డోకూర్​ ఎంపీటీసీ పరిధిలో మీనుగోనుపల్లి గ్రామం 53 పోలింగ్​ కేంద్రంలో ఫోటో తీసినట్లుగా అధికారులు నిర్ధరణకు వచ్చారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పీవో మంజులత, ఇంఛార్జీ ఎంపీడీవో శ్రీనివాస్ స్థానిక పోలీస్​ స్టేషన్​లో ​ ఫిర్యాదు చేశారు.
ఇవీ చూడండి: తుపాకీ మిస్​ఫైర్- పోలింగ్​ అధికారి మృతి

ABOUT THE AUTHOR

...view details