మొక్కలు నాటడమే కాకుండా.. బాధ్యతగా వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని.. ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో, బై-పాస్ రహదారి వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. భగీరథ కాలనీలో రూ. 5లక్షలతో, రాఘవేంద్ర స్వామి దేవాలయం ఆవరణలో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించే నూతన సీసీ రోడ్డుల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. పురపాలిక పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో రూ. 35లక్షలతో ఏర్పాటు చేసే పార్కుకు శంకుస్థాపన చేసిన మంత్రి... కాలనీలో కలియ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 21 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైనా 9లక్షల 28వేల రూపాయల చెక్కులను అందజేశారు.
మొక్కలను నాటడమే కాదు సంరక్షించాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ - Plant
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. అలాగే వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
శ్రీనివాస్ గౌడ్