మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వైద్యరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారుల బృందం పరిశీలించింది. కాయకల్ప్-2018 కింద ఆదర్శ పీహెచ్సీగా ఎంపికైనందున... నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్ ద్వారా అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు ఆసుపత్రిని సందర్శించి, వైద్యులకు పలు సూచనలు చేశారు.
దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలన - model phc
ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఆదర్శ పీహెచ్సీగా ఎంపికైన దేవరకద్ర ఆసుపత్రిని పరిశీలించి అధికారుల బృందం పలు సూచనలు చేసింది.
దేవరకద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలన
Last Updated : Apr 16, 2019, 7:46 AM IST