తెలంగాణ

telangana

ETV Bharat / state

అటవీ పరిసర గ్రామాల్లో మృగాలు.. భయాందోళనలో ప్రజలు - forest animal attacks in Mahabubnagar district

మహబూబ్ నగర్ జిల్లాలో లేగ దూడలపై క్రూర మృగాలు వరుసగా దాడులు చేస్తున్నాయి. అటవీ సమీపంలో ఉన్న గ్రామాల్లో మృగాల దాడిలో ఇప్పటి వరకు 6 దూడలు చనిపోవడంతో స్థానికలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై అటవీ అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

People panicking over animal attacks in Mahabubnagar district
అటవీ పరిసర గ్రామాల్లో మృగాలు.. భయాందోళనలో ప్రజలు

By

Published : Feb 24, 2021, 9:08 PM IST

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో పశువులపై క్రూర మృగాలు దాడిచేసి హతమార్చడం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. అడవి క్షేత్రానికి సమీపంలో పొలాల దగ్గర కట్టి ఉంచిన లేగ దూడలపై వరుసగా దాడులు చేస్తున్నాయి. ఈ విషయమై అటవీ అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలోని దేవరకద్ర, వెంకటయ్యపల్లి, నాగారం, చౌదర్​పల్లి, హజిలాపూర్​ గ్రామాల్లో క్రూర మృగాల దాడిలో ఇప్పటికే 6 లేగ దూడలు మృత్యువాత పడ్డాయి. అటవీ జంతువుల దాడిలో నష్టపోయిన వారికి పరిహరం చెల్లిస్తామని అటవీ అధికారులు అన్నారు. పశువులపై దాడి చేసేది చిరుత పులా? లేక మరేదైనా ఇతర జంతువా? అన్నవిషయాన్ని మాత్రం శాస్త్రీయంగా గుర్తించలేక పోతున్నామని తెలిపారు. అటవీశాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ.. మృగాలు జనావాసాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి 74 మంది పోటీ

ABOUT THE AUTHOR

...view details