కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోబోదని.. అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి పుర పీఠాలపై జెండా ఎగురవేస్తామని మహబూబ్‌నగర్ పార్లమెంట్ బాధ్యులు వంశీచంద్ రెడ్డి అన్నారు. పురపాలిక ఎన్నికలను పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన పాలమూరు జిల్లాలో మరోసారి తమ సత్తా చాటే విధంగా అందరూ కలిసి రావాలని కోరారు.
"పుర ఎన్నికల్లో పొత్తుల్లేవ్"
పుర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి గెలుస్తుందన్నారు మహబూబ్‌నగర్ పార్లమెట్ బాధ్యులు వంశీ చంద్ రెడ్డి. పార్టీ సీనియర్ నేతలు టికెట్ల కేటాయింపుపై అసహనానికి గురి కావద్దని విన్నవించారు.
"పుర ఎన్నికల్లో పొత్తుల్లేవ్"
సీనియర్ పార్టీని నేతలు అసహనానికి గురికావొద్దని.. కొత్త తరం వారికి అవకాశం వచ్చినట్లుగా భావించి పార్టీ ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. పురపాలక ఎన్నికలలో వార్డుల వారిగా ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకుని గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకుల నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు.
ఇవీ చూడండి: 'అసెంబ్లీ నిర్మాణంపై దాఖలైన వ్యాజ్యాలు కొట్టేయాలి'