MLAs Tested Corona Positive: మంత్రి నిరంజన్ రెడ్డి ఉమ్మడి వరంగల్ పర్యటనలో కరోనా కలకలం రేపుతోంది. ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకడంతో.. తెరాస నేతల్లో ఆందోళన మొదలైంది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులకు కరోనా సోకింది. రాత్రి జ్వరం రావడంతో.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, ఆయన భార్య వరంగల్ జడ్పీ ఛైర్పర్సన్ జ్యోతి.. కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. దీనిలో ఇద్దరికీ కరోనా సోకినట్లు ఫలితాలు వచ్చాయి.
మంత్రుల పర్యటనలో కరోనా కలకలం.. వైరస్ బారిన పడిన ఇద్దరు ఎమ్మెల్యేలు - గండ్ర వెంకటరమణారెడ్డి
08:37 January 19
కొవిడ్ బారిన పడిన ఎమ్మెల్యేలు.. హోం ఐసోలేషన్‌లో గండ్ర, శంకర్‌నాయక్
మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటే గండ్ర హెలికాప్టర్‌లో హైదరాబాద్ వెళ్లారు. సాయంత్రం గండ్ర దంపతులకు జ్వరం రావడంతో పరీక్షించుకోగా కొవిడ్‌గా తేలింది. జ్యోతి సీసీ ప్రదీప్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. మిగిలిన పీ.ఏ లు, సెక్యూరిటీలు కొవిడ్ పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. ప్రజలు క్షేమంగా ఉండాలని.. మాస్క్ ధరించాలని గండ్ర దంపతులు సూచించారు. హైదరాబాద్‌లో వెంకటరమణ రెడ్డి, హన్మకొండలోని నివాసంలో జ్యోతి హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు.
మంత్రుల పర్యటనలో పాల్గొన్న మరో ఎమ్మెల్యే కూడా కరోనా బారిన పడ్డారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సైతం వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో ఇంకా ఎవరెవరికి కరోనా సోకింది అనే విషయం తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి:SBI Report: మూడు వారాల్లో కొవిడ్ ఉగ్రరూపం