కాంగ్రెస్ పార్టీని పాలమూరు ప్రజలు తిరస్కరించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులు కట్టలేదని విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరులో 30లక్షల ఎకరాల సాగు భూమి ఉందన్న మంత్రి.. 2014కు ముందు లక్ష ఎకరాలకు మించి నీరందించారా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలకు పాలమూరు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 60ఏళ్లు అధికారంలో ఉన్న హస్తం పార్టీ ఏ మేరకు నీరందించారో చెప్పాలన్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తయినా నీళ్లు నింపలేదని ఆయన విమర్శించారు. కర్ణాటకకు రూ.70 కోట్ల పరిహారం కట్టాల్సి వస్తుందని నీళ్లు నింపడం ఆపారని పేర్కొన్నారు. గతంలో జూరాల, ఆర్డీఎస్ ద్వారా లక్ష ఎకరాలకే సాగునీరు అందించారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతే చాలా ప్రాజెక్టులు వచ్చాయని మంత్రి తెలిపారు. దసరా అనంతరం ఓ బస్సు ఏర్పాటు చేస్తామని.. ప్రాజెక్టులను సందర్శించి నీటి లభ్యతను చూడాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. తెదేపాలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కారణంగానే పాలమూరు జిల్లా నాశనం అయ్యిందని విమర్శించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు తెరాసపై అసత్యాలు చెబుతున్నారని ఆరోపించారు.
నీచ రాజకీయాలు చేస్తున్నరు..
శ్రీకాంతా చారి ఫొటో పెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. శ్రీకాంతా చారి మా బిడ్డ కాదా అంటూ ప్రశ్నించారు. పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాల లెక్కను మొత్తం బయటపెట్టామని మంత్రి వెల్లడించారు. కేంద్రం వ్యవసాయంపై ఎన్నో నిర్ణయాలు తీసుకుందని.. వాటిపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడరని ధ్వజమెత్తారు. 80 శాతం పూర్తి అయిన పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని రెండేళ్లలో పూర్తి చేసి నీళ్లందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
పాలమూరు వెనుకబాటుతనానికి పురుడుబోసింది.. పునాది కట్టింది.. కాంగ్రెస్ పార్టీనే. ఉమ్మడి పాలమూరు జిల్లా 30లక్షల పైచిలుకు సాగు భూమి ఉంది. వారి 60 ఏళ్ల పాలనలో పాలమూరు జిల్లాలో లక్ష ఎకరాలకు మించి నీళ్లు ఎక్కడైనా పారినాయా?. పాలమూరు గురించి, పాలమూరు నీటి వసతుల గురించి, పాలమూరు వ్యవసాయం గురించి, పాలమూరు బతుకుల గురించి మాట్లాడే కనీస అర్హత లేదు వాళ్లకు. -సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు..