కోయిల్‌సాగర్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో కలిసి కోయిల్‌సాగర్‌లో 3 రకాలకు చెందిన 7 లక్షల చేప పిల్లలను వదిలారు.
'భవిష్యత్తులో పర్యాటక ప్రాంతంగా కోయిల్‌సాగర్' - tourism news
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం కోయిల్‌సాగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్ రెడ్డితో కలిసి కోయిల్‌సాగర్ జలాశయంలో 7 లక్షల చేప పిల్లలను మంత్రి వదిలారు.
తొలుత కోయిల్‌సాగర్ వద్ద హరిత హోటల్ నిర్మించి... అనంతరం దశల వారీగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. జలాశయం వద్ద హట్స్, బోటింగ్‌కు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆధికారులను ఆదేశించారు. కోయిల్‌సాగర్‌ను పూర్తిస్థాయి నీటి పారుదల ప్రాజెక్టుగా మార్చనున్నామని... జూరాల నుంచి కాకుండా భవిష్యత్తులో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జలాశయాన్ని నింపుకునే అవకాశాలున్నాయని వివరించారు. కోయిల్‌కొండ, రాంకొండ, మన్యంకొండ, మహబూబ్‌నగర్ మొత్తాన్ని కలుపుకుని మహబూబ్‌నగర్ జిల్లాను పర్యాటక ప్రాంతగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.