మహబూబ్‌నగర్‌లోని జడ్పీ మైదానంలో హన్వాడ మండల పరిధిలోని పలు పంచాయితీలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్రాక్టర్లను అందజేశారు. గ్రామాల్లో దోమలు, ఈగలు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు.
ట్రాక్టర్లను పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - mahabubnagar district news today
మహబూబ్‌నగర్ జిల్లాలోని హన్వాడ మండల పరిధిలోని పలు గ్రామాలకు పర్యాటక,అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ట్రాక్టర్లను పంపిణీ చేశారు. గ్రామాలను పరిశుభ్రం, పచ్చదనంతో ఉంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ట్రాక్టర్లను పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డులను త్వరితగతిన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. భవిష్యత్తులో జిల్లాలో ఉన్న చెరువులను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నింపుతామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి :తెరాస గెలిస్తే ఇల్లందు బస్ డిపో హామీ ఏమైంది?