మహబూబ్‌నగర్ జిల్లా వీరన్నపేటకు చెందిన గంటేల వెంకటేశ్ కుటుంబం భూమి సమస్య పరిష్కారం కోసం కేటీఆర్ కాన్వాయ్‌కు అడ్డుపడింది. ఈ విషయమై కలెక్టర్ వెంకటరావు.. ఇప్పటికే విచారణకు అదేశించారు. బుధవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కలెక్టర్ వెంకటరావు సమక్షంలో ఆర్డీవో, డీఎస్పీ శ్రీధర్, తహసీల్దార్ సహా బాధిత కుటుంబ సభ్యులందరినీ పిలిచి మాట్లాడారు.
దగ్గరుండి పేదోడి భూ సమస్య పరిష్కరించిన మంత్రి - excise minister srinivas goud
మహబూబ్‌నగర్‌లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా భూసమస్య పరిష్కారం కోసం ఓ పేద కుటుంబం కాన్వాయ్కి అడ్డుపడిన ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
![దగ్గరుండి పేదోడి భూ సమస్య పరిష్కరించిన మంత్రి minister srinivas goud respond on land issue in mahabubnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8041615-thumbnail-3x2-srini.jpg)
దగ్గరుండి పేదోడి భూ సమస్య పరిష్కరించిన మంత్రి
వెంకటేశ్ కుటుంబానికి భూమి అమ్మిన వ్యక్తి అదే భూమిని మరొకరికి కూడా అమ్మాడని, ఈ విషయంపై చీటింగ్ కేసు నమోదు చేయాలని మంత్రి స్వయంగా డీఎస్పీని పిలిపించి చెప్పారు. అంతేకాక బాధిత కుటుంబానికి న్యాయంగా రావాల్సిన భూమిని వందశాతం ఇస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి రక్షణగా ఉంటామని.. వారు ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. వారి భూమిని వెంటనే ఇప్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
ఇదీ చూడండి:టార్గెట్ సచిన్... కాంగ్రెస్ కీలక నిర్ణయం