Minister Srinivas goud firing: మహబూబ్‌నగర్ ఫ్రీడం ఫర్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గాల్లోకి కాల్పులు జరపటం కలకలంరేపింది. జిల్లా పరిషత్ మైదానం నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాజరైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. ర్యాలీ ప్రారంభ సమయంలో తుపాకీతో గాల్లోకి ఒక రౌండు కాల్పులు జరిపారు. పోలీసుల తుపాకీతో మంత్రి గాల్లోకి కాల్పులు జరపటంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
వివాదంగా మారిన కాల్పుల ఘటనపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఏమన్నారంటే - Minister Srinivas Goud explanation on Gun Firing incident
16:06 August 13
ఫ్రీడం ఫర్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కాల్పుల కలకలం
కాసేపు ఈ ఘటన వివాదానికి దారితీయటంతో.. మంత్రే స్వయంగా వివరణ ఇచ్చారు. ఫ్రీడం రన్ ప్రారంభోత్సవం వేళ రబ్బర్ బుల్లెట్ తుపాకీని తాను పేల్చినట్లు మంత్రి స్పష్టం చేశారు. తనకు ఎస్పీనే స్వయంగా తుపాకీ ఇచ్చారని వివరించారు. గతంలోనూ క్రీడల ప్రారంభోత్సవ సమయంలో రబ్బర్ బుల్లెట్ పేల్చినట్లు చెప్పారు. కొందరు అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
"ఫ్రీడం రన్ ప్రారంభోత్సవం సందర్భంగా రబ్బర్ బుల్లెట్ పేల్చాను. ఎస్పీ ఇచ్చిన రబ్బర్ బుల్లెట్ తుపాకీ పేల్చాను. గతంలోనూ క్రీడల ప్రారంభోత్సవంలో రబ్బర్ బుల్లెట్ పేల్చాను. నేను ఆలిండియా రైఫిల్ అసోసియేషన్ సభ్యుడిని. గన్‌కు సంబంధించిన నిబంధనలన్నీ నాకు తెలుసు. దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు." - శ్రీనివాస్‌గౌడ్, మంత్రి
ఇవీ చూడండి: