మహబూబ్‌నగర్ జిల్లా ఛైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చిన్న చింతకుంట మండల కేంద్రంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న నర్సులను మంత్రి నిరంజన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి సన్మానించారు.
నర్సులను సన్మానించిన మంత్రి నిరంజన్‌రెడ్డి - international nurses day
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నర్సులను సన్మానించారు. నర్సులకు శుభాకాంక్షలు తెలిపి, వారి సేవలను కొనియాడుతూ అభినందించారు.
నర్సులను సన్మానించిన మంత్రి నిరంజన్‌రెడ్డి
కరోనా కట్టడిలో నర్సుల, వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమని మంత్రి కొనియాడారు. కరోనా సమయంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారి సేవలను గుర్తుకు చేసుకోవడం ఆనందంగా ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.
ఇవీ చూడండి: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి