మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మార్కెట్ యార్డు పద్ధతిలో నిర్మించిన ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గోదాములను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. చిన్న చింతకుంట మండలం లాల్కోట పెద్దవాగులో రూ.4.9 కోట్లతో నిర్మించనున్న చెక్‌డ్యామ్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి
వ్యవసాయ రంగం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
దేశానికి ఆదర్శంగా రాష్ట్ర వ్యవసాయ సాగు విధానాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ సమగ్రమైన విధానం తెచ్చేందుకు నిపుణులతో చర్చించినట్లు మంత్రి తెలిపారు. వచ్చే యాసంగి పంటలకు కొత్త వ్యవసాయ విధానం అమల్లోకి వచ్చే అవకాశముందన్నారు. ఈ వానాకాలం పంటలు మాత్రం ఇష్టమైన పంటను సాగు చేసుకోవచ్చని రైతులకు సూచించారు. పోతిరెడ్డి పాడు జలాశయాల వినియోగంపై ఏపీ ప్రభుత్వంతో న్యాయమైన పోరాటం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా, గోదావరి జలాలను సాధించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.
ఇదీ చూడండి :ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తు ఒక్క అడుగే!