ప్రాదేశిక ఎన్నికల్లో అందరూ జిల్లాలోని తెరాస అభ్యర్థులను గెలిపించాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. మహబూబ్‌నగర్ జిల్లా పెద్దమందడిలో ఏర్పాటు చేసిన తెరాస విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలను ప్రజలకు వివరించమని అభ్యర్థులకు సూచించారు. జిల్లాలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
"మీరు వివరించండి.. వాళ్లు గెలిపిస్తారు" - niranjan reddy
కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రతి గడపకు చేరిస్తే తెరాస అభ్యర్థుల విజయం ఖాయమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ సేనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
"మీరు వివరించండి.. వాళ్లు గెలిపిస్తారు"