మాస శివరాత్రిని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలోని ఈశ్వర వీరప్పయ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నప్రసాదంతో స్వామివారిని శ్వేత వర్ణ శివలింగంగా అలంకరించారు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలోని అమ్మవారిని కూరగాయలతో శాకంబరి దేవీగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అభిషేకాలు, అర్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్వేతవర్ణంలో శివలింగం.. పోటెత్తిన భక్తజనం.. - అమ్మవారు
శివలింగాన్ని అన్నప్రసాదంతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. కన్యకా పరమేశ్వరిని శాకాంబరి దేవిగా అలంకరించారు.
శ్వేతవర్ణంలో శివలింగం.. పోటెత్తిన భక్తజనం..