అక్షయ తృతీయ సుముహూర్తాన... లాక్‌డౌన్ నిబంధనలతో మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా శుభకార్యాలు కొనసాగాయి.మూడు ముళ్లు.. ఏడడుగులు, తప్పెట్లు.. తాళాలతో ఇద్దరు ఒక్కటయ్యే సుమధుర ఘట్టం పెళ్లి. బందుమిత్రుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకునే వివాహాలు కేవలం 10 మంది మధ్య నిరాడంబరంగా జరిగాయి. ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్ నిబంధనల మధ్య కొన్ని వివాహాలు, గృహప్రవేశాలు జరిగాయి.
ఆదివారం బసవ జయంతి, అక్షయ తృతియ ఉండటం వల్ల శుభదినంగా భావించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తూ ఎక్కువ సంఖ్యలో శుభకార్యాలను నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీచర్స్‌కాలనీలో యువ వైద్యులు మాస్క్‌లు ధరించి వివాహతంతులో పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూనే కేవలం వధూవరుల కుటుంబసభ్యులతో అర్చకుల మంత్రోచ్చరణల మధ్య వివాహం జరిగింది.
కరోనా ఎఫెక్ట్: నిరాడంబరంగా శుభకార్యాలు - corona effect
బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా జరగాల్సిన వివాహాలు... లాక్‌డౌన్ నేపథ్యంలో పది మంది కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా జరుగుతున్నాయి. అక్షయ తృతీయ సుముహూర్తాన మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనల మధ్య కొన్ని శుభకార్యాలు జరిగాయి.
కరోనా ఎఫెక్ట్: నిరాడంబరంగా శుభకార్యాలు
ఇవీ చూడండి: దాతల విరాళాలు దుర్వినియోగం : తల్లోజు ఆచారి