హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన వెంకటేశ్వర్ రెడ్డి అప్పుల బాధతో జడ్చర్లలోని ఓ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. చెప్పుల దుకాణం నిర్వహించే వెంకటేశ్వర్ రెడ్డికి వ్యాపారంలో నష్టాలు రావటంతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. చనిపోయే ముందు స్నేహితునికి లేఖ రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఉత్తరాన్ని బట్టి అతడు ఆర్థిక సమస్యలతో మరణించాడనే నిర్ధరణకు వచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
వ్యాపారి ఆత్మహత్య - అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య
అప్పుల బాధ భరించలేక ఓ వ్యాపారి లాడ్జిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య