తెలంగాణ

telangana

ETV Bharat / state

సహకార ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తి.. - మహబూబ్​నగర్​ తాజా వార్త

సహకార సంఘాల ఎన్నికలకు సోమవారం సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ పూర్తైయింది. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని 76 సహకార సంఘాలకు గానూ 6 సంఘాల డైరెక్టర్​ పదవులు ఏకగ్రీవమైయ్యాయి. మిగిలిన 70 సంఘాలకు ఈ నెల 15వ తేదీన ఎన్నికల జరుగనున్నాయి.

majority-is-unanimous-in-the-election-of-co-operative-societies-in-mahabubnagar
సహకార ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తి..

By

Published : Feb 11, 2020, 1:02 PM IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఉమ్మడి జిల్లాలో ఆరు చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. ఇందులో దాదాపు అన్ని సహకార సంఘాల్లో తెరాస మద్దతుదార్లు విజయం సాధించారు.

జిల్లాసహకార సంఘాలువార్డులుఏకగ్రీవాలు
మహబూబ్‌నగర్‌1726180
నారాయణపేట1019143
వనపర్తి1538531
నాగర్‌కర్నూల్‌2355453
జోగులాంబ గద్వాల1122839

జిల్లా పరిధిలో మొత్తంగా 76 సోసైటీలకు గాను.. 988 వార్డులున్నాయి. అందులో 203 వార్డులకు ఏకగ్రీవాలు జరిగాయి. 76 సంఘాలకు గానూ 1619 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.

సహకార ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ పూర్తి..

ఇదీ చూడండి: 'సహకారం'లో సగానికిపైగా ఏకగ్రీవం!

ABOUT THE AUTHOR

...view details