తనను ఎంపీగా ప్రజలు తప్పకుండా గెలిపిస్తారనే నమ్మకం ఉందని మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు మిగిలిన ఆరు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తున్నారని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
'కాంగ్రెస్ కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేస్తున్నారు' - CAHALLA
శివకుమార్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేసినప్పటి నుంచి పార్టీ కోసం ఆయన, అతని అనుచరులు చాలా కష్టపడుతున్నారు. ఎంపీగా నన్ను గెలిపించేందుకు కార్యకర్తలు ఉద్ధృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు: చల్లా వంశీచంద్ రెడ్డి, మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
'కాంగ్రెస్ కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేస్తున్నారు'
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శివకుమార్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేసినప్పటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ కోసం కష్టపడే ఏ ఒక్క నాయకుడిని హస్తం పార్టీ వదులుకోదని వంశీచంద్ రెడ్డి చెప్పారు. అధిష్ఠానంతో మాట్లాడి శివకుమార్‌కు మంచి గుర్తింపును ఇచ్చేవరకు కృషి చేస్తానన్నారు.
ఇవీ చదవండి:9 సభల్లో కేసీఆర్... రోడ్ షోలతో కేటీఆర్