పాలమూరు జిల్లాకే తలమానికమైన పిల్లలమర్రి సంరక్షణకు చేసిన ప్రయత్నాలు ఫలించాయని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. మహబూబ్నగర్ సమీపంలోని పిల్లల మర్రి చెట్టును, కొత్తగా వచ్చిన ఊడలను పరిశీలించారు. పిల్లలమర్రి ఊడలు పాడైపోయి, శిథిలావస్థకు చేరుకున్న దశ నుంచి కొత్త ఊడలు వచ్చేలా చేసి పచ్చదనాన్ని నింపటంలో జిల్లా అటవీ శాఖ అధికారులు చేసిన కృషిని ఆయన అభినందించారు.
రెండేళ్ల కిందట వివిధ కారణాలతో శిథిలావస్థకు చేరుకోవడమే కొమ్మలు, ఊడలు విరిగిపోయాయి. ఈ దశలో జిల్లా అటవీ శాఖ పిల్లలమర్రిని సంరక్షించే బాధ్యతలను చేపట్టింది. చెదలు, తెల్లపుండు నివారణ కోసం క్లోరోఫైరిఫస్ ద్రావాణాన్ని సెలైన్ బాటిళ్ల ద్వారా కొమ్మల్లోకి ఎక్కించారు.