కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ పథకం ద్వారా రేషన్ కార్డు లేని వారితో పాటు వలస కూలీలకు నెలకు 5 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు తెలిపారు. మే, జూన్ నెలలకు కలిపి 10 కిలోలు అందిస్తామని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నుంచి ఆదేశాలు అందినట్లు వెల్లడించారు.
వలసకూలీలు, రేషన్‌కార్డు లేనివారి కోసం ఆత్మ నిర్భర్ - migrants problems
వలస కూలీలు, రేషన్ కార్డు లేని వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ పథకం కింద ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం పంచనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్లు మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు.
వలసకూలీలు, రేషన్‌కార్డు లేనివారి కోసం ఆత్మ నిర్బర్
ఈ పథకం కింద మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న 25 వేల 408 మంది రేషన్ కార్డు లేని వారికి బియ్యం అందించనున్నట్లు తెలిపారు. అందుకుగాను 254 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం కేటాయించినట్టు వివరించారు. ఏప్రిల్ తర్వాత ఇంకా ఎవరైనా వలస కూలీలను గుర్తించినట్లయితే వారికి సైతం బియ్యం పంపిణీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.