రాజీ కాదగిన అన్ని కేసుల్లోనూ కక్షిదారులు కేసులను రాజీ చేసుకోవచ్చని.. కోర్టు కేసుల నుంచి ఉపశమనం పొందేందుకు ఇదో చక్కటి అవకాశమని మహబూబ్‌నగర్ జిల్లా న్యాయమూర్తి జస్టిస్ ప్రేమవతి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు సముదాయంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంను ఆమె ప్రారంభించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకునే విధంగా అత్యున్నత న్యాయస్థానం లోక్ ఆదాలత్ కార్యక్రమం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.
మోటారు వాహనాల ప్రమాద కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాల కేసులు, బ్యాంక్ లోన్ పెండింగ్ కేసులతో పాటు తీవ్రతను బట్టి క్రిమినల్, సివిల్ కేసులకు సైతం రాజీ కుదుర్చుతున్నట్టు వివరించారు. చాలా కేసులు క్షణికావేషంలో చేసుకున్నవేనని.. ఇరు పక్షాలు కుర్చూని మాట్లాడుకుంటే సమస్య సద్దుమనిగిపోతుందని అభిప్రాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు సముదాయంలో నాలుగు ప్రత్యేక బెంచ్‌లను ఏర్పాటు చేసి కేసుల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
'కోర్టు కేసుల నుంచి ఉపశమనం కోసమే లోక్ అదాలత్' - మహబూబ్‌నగర్ తాజా వార్త
చాలా కేసులు క్షణికావేషంలో చేసుకున్నవేనని.. ఇరు వర్గాలు కూర్చుని మాట్లాడుకుంటే కేసులను రాజీ చేసుకోవచ్చని జిల్లా న్యాయమూర్తి జస్టిస్ ప్రేమవతి అభిప్రాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో లోక్ అదాలత్ కార్యక్రమంను జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఆమె ప్రారంభించారు.
'కోర్టు కేసుల నుంచి ఉపశమనం కోసమే లోక్ అదాలత్'