తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్రిక్తమైన కోయిల్​కొండ గ్రామస్థుల నిరసన

మహబూబ్​నగర్​ రహదారిపై కోయిల్​కొండ గ్రామస్థుల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులపై రాళ్లదాడితో యుద్ధ వాతావరణం నెలకొంది.

By

Published : Feb 4, 2019, 2:25 PM IST

dammayapally

కోయిల్​కొండలో పోలీసుల లాఠీ చార్జీ
మహబూబ్​నగర్​ జిల్లా కోయిల్​కొండ మండలం దమ్మాయిపల్లి గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోయిల్​కొండను జిల్లాలోనే కొనసాగించాలని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. అంబులెన్స్​కు దారి ఇవ్వకపోవడం వల్ల పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడం వల్ల పోలీసులు లాఠీ చార్జీ చేశారు. నిరసనకారులు రాళ్లదాడితో ప్రతిఘటించారు. దాడిలో సీఐ పాండురంగారావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకొని స్టేషన్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details