మహబూబ్నగర్, నారాయణపేట జిల్లా సరిహద్దులుగా ఉన్న కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతాంగానికి రెండో పంట సాగు చేసుకునేందుకు గాను స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి నీటిని విడుదల చేశారు.
కోయిల్ సాగర్ ఆయకట్టుకు రెండో పంట నీటి విడుదల - నీటి విడుదల తాజా వార్త
కోయిల్ సాగర్ ఆయకట్టు కింద రెండో పంట సాగు చేసుకునేందుకు గాను నీటిని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. సుమారుగా 270 క్యూసెక్కుల నీటిని కాలువల ద్వారా ఆయకట్టుకు వదిలారు.
కోయిల్ సాగర్ ఆయకట్టుకు రెండో పంట నీటి విడుదల
ఎడమ కాలువ నుంచి 90, కుడికాలు నుంచి 180 క్యూసెక్కుల నీటిని కాలువల ద్వారా ఆయకట్టుకు వదిలారు. ఆయకట్టు రైతాంగం నీటిని వృధా చేసుకోకుండా రెండో పంట సాగుకు పూర్తి స్థాయిలో ఈ నీటిని వినియోగించుకోవాలని కోరారు. రెండో పంటకు సాగునీటిని విడుదల చేసినందుకు ఆయకట్టు రైతాంగం ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు