మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఇవాళ తహశీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పలు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. లాక్డౌన్లో పనులు దొరకని వారికి ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలన్నారు. శ్మశాన వాటికల నిర్మాణం, హరిత హారం పనులు చేయాలని చెప్పారు. ప్రజలు, సిబ్బందికి అవసరమైన శానిటైజర్, మాస్కులను అందించాలన్నారు.
'ఎవరికైనా ఆరోగ్య సమస్యలుంటే ఫోన్ చేయండి' - కలెక్టర్ వెంకట్రావ్ పర్యటన
లాక్డౌన్ సమయంలో బైక్‌లపై ఇద్దరు, ముగ్గురు ప్రయాణిస్తే సీఆర్పీసీ 107, 110 వాహన చట్టం క్రింద కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు పోలీసు అధికారులను ఆదేశించారు. కంటైన్మెంట్ ప్రాంతంలో ఆయన పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామాల్లో కరోనా వ్యాప్తి నివారణకు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం చల్లాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం సేకరించాలన్నారు. కూరగాయలు, నిత్యావసరాల కోసం వచ్చేవాళ్లు మాస్కులు ధరించేలా చూడాలని తెలిపారు. పట్టణంలోని కంటైన్మెంట్ జోన్లలో ఉన్న ప్రజలకు పాలు, పండ్లు, కూరగాయలు ఇళ్లవద్దకే వస్తాయన్నారు. ప్రజలు ఇంట్లోనే ఉంటే కరోనాను కట్టడి చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 3 టెలి మెడిసిన్ వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలుంటే 08542-226670కు ఫోన్ చేస్తే మందులు అందిస్తారని లేదా ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ డాక్టర్‌కు రెఫెర్ చేస్తారని కలెక్టర్ వివరించారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో కరోనాతో మరొకరి మృతి