farmers on rythu bazar shifting: మహబూబ్‌నగర్‌లో పాత రైతుబజార్‌ను మార్చవద్దంటూ రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీ గుట్ట ప్రాంతంలో ప్రస్తుతం రైతుబజార్ నడుస్తుండగా తరలిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నూతన మార్కెట్లో సౌకర్యాలు లేవని ఆరోపిస్తున్నారు.
mahaboobnagar rythu bazar:జిల్లాకేంద్రంలోని రామయ్యబౌళి వద్ద ఐదున్నర కోట్లతో ప్రభుత్వం నూతన సమీకృత మార్కెట్‌ను నిర్మించింది. రైతులు కూరగాయలు అమ్ముకునేందుకు తాత్కాలికగా ఏర్పాట్లు చేసింది. అయితే రైతులు తాము అక్కడికి వెళ్లమంటున్నారు. రవాణా, సౌకర్యాలలేమి కారణంగా చూపుతూ తాము పాత రైతుబజార్‌లోనే అమ్ముకుంటామని చెబుతున్నారు. రైతులకు నచ్చజెప్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
farmers on mahaboobnagar: మార్కెట్‌ను తరలించొద్దు: రైతులు
మాకు కూరగాయల మార్కెట్ ఇక్కడే ఉంటే బాగుంటుంది. అక్కడకు మారిస్తే వృద్ధులకు, స్త్రీలకు తిప్పలైతది. అక్కడ వెళ్లాలంటే మెయిన్ రోడ్డు దాటాల్సి వస్తది. అందుకే మార్కెట్ ఇక్కడే ఉండాలని కోరుతున్నాం. ఇక్కడికైతే అందరికీ అందుబాటులో ఉంటది. చాలామంది మార్కెట్‌కు వస్తరు సార్. -గోవిందమ్మ, రైతు
మహబూబ్‌నగర్‌లోని రైతు బజార్
అక్కడ మాకు అమ్ముకొవడానికి మంచిగా లేదు. ఇక్కడే అమ్ముతాం. ఈ రైతు బజార్ కూలకొడితే మేం రోడ్డునపడతాం. ఇక్కడైతే కిరాణాషాపులు ఉన్నాయి. ఆటోలు కూడా ఇక్కడికే వస్తాయి. అక్కడ మెయిన్ రోడు దాటాలంటే కష్టం. ఈ మార్కెట్ ఎప్పటినుంచో ఉంది. చుట్టు పక్కల ప్రజల గ్రామాలు అందరూ ఇక్కడికే వస్తారు. దాదాపు 2వేల మంది ఇక్కడికి వస్తారు. అందుకే మార్కెట్ ఇక్కడి నుంచి తీసెయొద్దని కోరుతున్నాం. అంతేగానీ దీన్ని మరింత పెద్దగా విస్తరించాలి. - లక్ష్మమ్మ, విక్రయదారులు
అన్ని మండలాల నుంచి ఇక్కడికే వచ్చి అమ్ముకుంటాం. దీన్ని మారిస్తే మాకు ఇబ్బంది అయితది. అక్కడకు మారిస్తే మాకు రవాణా ఛార్జీలు ఎక్కువ అవుతాయి. అక్కడ రోడ్డు దాటాలంటేనే కష్టం. దయచేసి ఈ మార్కెట్‌ను తరలించొద్దు. ఇక్కడకైతే ఆటోలు రావడం వల్ల మాకు సులభంగా ఉంటుంది. మాలాంటి వృద్ధులకు చాలా కష్టం. కూరగాయల సంచులు మోసుకెళ్లాలంటే కష్టమైతది. ఈ మార్కెట్‌నే డెవలప్ చేయాలని కోరుతున్నాం. -నర్సింహులు, విక్రయదారుడు.
మేం ఇక్కడి నుంచి ఎక్కడికి పోం. అక్కడ రోడ్డు దాటలేం. యాక్సిడెంట్లు అయితే ఎవరు బాధ్యులు. అక్కడ మెట్లు ఉంటాయి. మాలాంటి వృద్ధులకు చాలా కష్టం. ఈ రైతు బజార్‌ను డెవలప్ చేయాలి. ఇక్కడైతే మాకు గిరాకీ కూడా ఉంటది. అన్ని షాపులకు వచ్చిన వాళ్లందరూ ఇక్కడికి వస్తారు. అక్కడికంటే ఇక్కడే కావాల్సినంత స్థలం ఉంది. గవర్నమెంట్ దయచేసి దీన్ని మంచిగా కట్టాలని కోరుతున్నాం. -బాలమ్మ, విక్రయదారులు
ఇదీ చూడండి:
Farmers Problems: రైతులకు అడుగడుగునా కష్టాలే.. కొనేదిక్కులేక అవస్థలు..