తెలంగాణ

telangana

ETV Bharat / state

కురుమూర్తి బ్రహ్మోత్సవాల పొడిగింపు

తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మహబూబ్ నగర్ జిల్లా చింతకుంట మండలంలోని కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను ఆలయ నిర్వాహకులు భక్తుల విన్నపం మేరకు పొడిగించారు. ఉత్సవాలు ఈ నెల 18 వరకు కొనసాగనున్నాయి.

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల పొడగింపు

By

Published : Nov 15, 2019, 12:46 PM IST

ఆశ్వయుజ శుద్ధ అమావాస్య నాడు ప్రారంభమైన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 వరకు ముగించాల్సి ఉండగా భక్తుల విన్నపం మేరకు ఆలయ నిర్వాహకులు నవంబర్ 18 వరకు పొడిగించారు. అనంతరం స్వామివారి ఆభరణాలను తిరిగి బ్యాంకులో భద్రపరుస్తారు. నవంబర్ చివరి వారం వరకు ఆలయానికి భక్తులు వస్తూనే ఉంటారు. దూర ప్రాంతాలకు చెందిన భక్తులు ఉత్సవాల తర్వాత కూడా నెలరోజుల వరకు ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల పొడగింపు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details