మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఈశ్వరస్వామి ప్రభోత్సవం రంగరంగవైభవంగా జరిగింది. ప్రభపై నుంచి స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. శివనామస్మరణ చేస్తూ, పరమేశ్వరుని సంకీర్తనలు ఆలపిస్తూ భక్తులు స్వామిని ఊరేగించారు. యువకులు రథం లాగుతూ ముందుకు సాగారు. ప్రభోత్సవంతో ఈశ్వర వీరప్ప స్వామి మహోత్సవాల ప్రధాన ఘట్టం ముగిసింది.
దేవరకద్రలో వైభవంగా ఈశ్వరవీరప్ప స్వామి ప్రభోత్సవం - devarakadra
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో ఈశ్వర వీరప్పస్వామి 90వ సప్త మహోత్సవాలలో ప్రధాన ఘట్టమైన ప్రభోత్సవం కన్నులపండువగా జరిగింది. పురవీధుల్లో మంగళహారతులతో మహిళలు స్వామివారికి స్వాగతం పలికారు.
ఈశ్వరబీరప్ప స్వామి ప్రభోత్సవం