ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొంతమంది స్వార్థపరుల చేతిలో కొట్టుమిట్టాడుతోందని మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి డోకూరి పవన్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. డీకే అరుణ వర్గీయులను పార్టీలో ఉంచకూడదనే ఉద్దేశంతోనే తనను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెన్షన్ నిర్ణయాన్ని తీసుకొని నేరుగా పత్రికా ప్రకటన విడుదల చేయడం బాధాకరమన్నారు.
నోటీసు ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారు: డోకూరి - pavan
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి, టీపీసీసీ సభ్యుడు డోకూరి పవన్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే పార్టీలోని కొందరు నాయకులు కావాలనే తనను సస్పెండ్ చేయించారని ఆయన ఆరోపించారు.
నోటీసు ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారు