తెలంగాణ

telangana

ETV Bharat / state

'పోలీసుల అదుపులో డోకూర్ హంతకులు' - DEVARAKADRA MANDAL

మహబూబ్​నగర్ జిల్లా డోకూర్​లో భాజపా కార్యకర్త ప్రేమ్ కుమార్​ను హత్య చేసిన ఘటనలో ఆరుగురు ప్రధాన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

భూత్పూర్ సీఐ కార్యాలయంలో విచారణ అనంతరం రిమాండ్​కు తరలింపు

By

Published : Jun 6, 2019, 7:30 PM IST

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో భాజపా కార్యకర్తను హత్య చేసిన ఘటనలో ఆరుగురు నిందితులను నేడు ఆత్మకూర్ కోర్టులో హాజరుపరిచామని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో పూర్తి వివరాలను సేకరించేందుకు డీఎస్పీ భాస్కర్​ నేతృత్వంలో భూత్పూర్ సీఐ పాండురంగారెడ్డి, దేవరకద్ర ఎస్ఐ వెంకటేశ్వర్లును ఆదేశించినట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. డోకూర్​లో భాజపా కార్యకర్తను హత్యచేసిన నిందితులను భూత్పూర్ సీఐ కార్యాలయంలో విచారణ చేసి రిమాండ్​కు తరలించారు.

డోకూర్ నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details