మహబూబ్ నగర్ జిల్లా చెన్నకేశవస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా చెన్నకేశవస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. జడ్చర్ల మండలంలోని గంగాపూర్ గ్రామంలో ఉన్న ఈ ఆలయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఆలయానికి బైపాస్ రోడ్డుతో పాటు..ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. జిల్లాకు వరప్రదాయిని అయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు త్వరగా పూర్తికావాలని ప్రార్థించినట్లు లక్ష్మారెడ్డి వెల్లడించారు.