దేవరకద్ర మండలం నాగారంలో నిర్బంధ తనిఖీలు - checks
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలులేని 24 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
నాగారంలో నిర్బంధ తనిఖీలు
మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని నాగారం గ్రామంలో జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు, తొమ్మిది మంది ఎస్సైలు 100 మంది పోలీస్ సిబ్బందితో కలిసి నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలపై అవగాహన కల్పించారు. గ్రామస్తులకు పోలీసులు మిఠాయిలు పంచిపెట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని సూచించారు.