ప్రకృతి అందాలకు నల్లమల పెట్టింది పేరు. కనుచూపు మేరలో పరుచుకున్న పచ్చదనం... పక్షుల కిలకిల రాగాలు.. వన్యప్రాణుల చిలిపి అరుపులు, సయ్యాటలు... ప్రకృతి సోయగాలు... గుబురుగా ఉన్న చెట్ల మధ్య మెలికలు తిరిగిన రహదారి... ప్రకాశం, కర్నూలు జిల్లాల సరిహద్దులోని సుందరమైన దృశ్యం ఇది. కొన్ని రోజుల కిందటి వరకు భానుడి ప్రతాపానికి చెట్లు ఎండిపోయాయి. పచ్చదనం మచ్చుకైనా కానరాలేదు.
వండర్ ఆఫ్ నేచర్లో మరుపురాని ప్రయాణం - nallamala latest news
నల్లమల అడవుల్లో మంచు దుప్పటిని చీల్చుకుంటూ... మలుపుల్లో చేసే ప్రయాణం మరపురాని అనుభూతినిస్తుంది. ఈ అనుభూతిని, ప్రకృతి శోభను ఆస్వాదించనికి ఇదే సరైన సమయం..! ఎన్నో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన దృశ్యాలు చూపడానికి... నల్లమల అడవులు రా... రమ్మని ఆహ్వానిస్తున్నాయి.
Nallamala
కానీ ఇటీవల కురిసిన వర్షాలకు... చెట్లు చిగురించాయి. అందాలు విరబూశాయి. రహదారికి ఇరువైపులా... ఉన్న ఎత్తైన వృక్షాలు పంచే హాయి మాటల్లో చెప్పలేనిది. ఆ భారీ వృక్షాలపై వన్యప్రాణులు చేసే సందడితో నల్లమల అలరారుతోంది. ఇలాంటి వాతావరణంలో... నల్లమల ఘాట్ రోడ్డులో ప్రయాణం అత్యంత ఆనందదాయకం. ప్రకాశం జిల్లా గెడ్డలూరు నుంచి కర్నూలు జిల్లా సరిహద్దు వరకూ... సుమారు 25 కిలోమీటర్ల మేర ఇలాంటి ఆహ్లాదకర వాతావరణమే ఉంది.