మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కనీస వేతనాలు పెంచాలని, పెండింగ్లో ఉన్న పారితోషికాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలక్టరేట్ ముట్టడికి యత్నించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశాకార్యకర్తలు ర్యాలీగా వస్తుండగా... తెలంగాణ చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. కోపోద్రిక్తులైన నిరసన కారులు అక్కడే ధర్నా చేశారు. గత ఐదు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాన్ని 18 వేలకు పెంచకపోతే... జులైలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
కలక్టరేట్ ముట్టడికి ఆశా కార్యకర్తల యత్నం - DHARNA
కనీస వేతనాలు పెంచాలని, గత ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న పారితోషికాలు వెంటనే చెల్లించాలని ఆశా కార్యకర్తలు రోడ్డెక్కారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు.
కలక్టరేట్ ముట్టడికి ఆశా కార్యకర్తల యత్నం