తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రాణాలు అడ్డుపెట్టి పని చేశాం.. జీతం పెంచండి' - ఆన్లైన్ సర్వే

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. జీతాలు పెంచాలని డిమాండ్​ చేస్తూ.. కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు.

Asha activists in Mahabubnagar district center raised concerns Deployed in front of the Collector's Office.
'ప్రాణాలు అడ్డుపెట్టి పని చేశాం.. జీతం పెంచండి'

By

Published : Feb 11, 2021, 7:29 PM IST

కనీస వేతనాల పెంపును డిమాండ్ చేస్తూ మహబూబ్​నగర్ జిల్లాలోని ఆశా కార్యకర్తలు కలెక్టరేట్​ను ముట్టడించారు. జీతం పెంచితేనే ఆన్లైన్ సర్వే చేపడతామని తేల్చి చెప్పారు. తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పురపాలక కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.

కొవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలు అడ్డు పెట్టి విధులు నిర్వహించామని ఆశాలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ కష్టాలను గుర్తించకుండా.. ఇంకా పని భారం పెంచుతోందని వాపోయారు. జీతాలు పెంచి, ఆన్లైన్​ సర్వేకు అవసరమయ్యే కనీస సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:వేధింపులను అడ్డుకోవాలంటూ ఆశాల వినతిపత్రం

ABOUT THE AUTHOR

...view details