రాజ్యాంగంలో అంబేడ్కర్ రాసిన ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణను ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగిందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహించిన 20వ అంబేడ్కర్ జాతరలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేసి అభివృద్ధి పరుస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక గురుకులాలు పెట్టి కార్పోరేట్ స్థాయిలో ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి అందరి మహానుభావుల విగ్రహాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అంబేడ్కర్ వల్లే రాష్ట్రం సాధ్యమయింది: శ్రీనివాస్ గౌడ్
అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే మనకు ప్రత్యేక రాష్ట్రం కల స్వప్నించిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 20వ అంబేడ్కర్ జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రం ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అభివృద్ధిలో పెద్ద పీట వేస్తుందని వెల్లడించారు.
అంబేడ్కర్ జాతరలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్